Saturday, November 23, 2024
HomeతెలంగాణSandra: సుపరిపాలన దినోత్సవ వేడుకలు

Sandra: సుపరిపాలన దినోత్సవ వేడుకలు

88 ఎకరాలకు చెందిన 55 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు

కల్లూరు రైతువేదికలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జరిగిన సుపరిపాలన దినోత్సవం మండల పరిధిలోని పడమటి లోకవర్గానికి చెందిన రైతులు 40 ఏళ్లుగా భూమి సాగుచేసుకుంటున్న పట్టాలు లేకపోవడంతో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం కలెక్టర్, అధికారులతో మాట్లాడి 88 ఎకరాలకు చెందిన 55 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.

- Advertisement -


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికలాంగులకు మూడువేల ఒక వంద 16 నుండి 4వేల ఒక్క వంద 16 రూపాయలకు పెన్షన్ ని పెంచడం చాలా చక్కని పరిణామం అని దానికిగాను కృతజ్ఞతగా కల్లూరులో దివ్యాంగులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలించిన వివిధ పార్టీలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారు అని కానీ కెసిఆర్ హయాంలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గ ప్రజలకు సంక్షేమ పథకాల వలన ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరుతుంది అని, బిఆర్ఎస్ పార్టీ నాయకులమైన తాము కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల బాగు కోరుతాము అని వచ్చే ఎన్నికలలో తాము సంక్షేమ పథకాలని చూపెట్టి ఓట్లను అడుగుతాము అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News