విద్యాలయలను సంరక్షించే అధికారి లంచగొండి అధికారిగా దందా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహింస్తూన్నారు రమేష్. జిల్లాలో ఏ పాఠశాలకు ఎన్ ఓ సి ఇవ్వాలన్నా జిల్లా విద్యాధికారికి లంచం ఇస్తే తక్షణం పని అయిపోతుంది అంతే. లేదంటే ఆ స్కూల్ కు ఎన్ ఓ సి వచ్చే ఛాన్స్ ఉండదు. తనిఖీలు ఉండవ్. ఈ వ్యవహారాలన్నీ ఆయన అసిస్టెంట్ రామకృష్ణ చక్కబెట్టేస్తాడు. ఓ ప్రైవేట్ స్కూల్ ఎన్ ఓ సి కోసం డిఈవోను ఆ స్కూల్ యాజమాన్యం కలిసింది. ఎన్ ఓ సి రావాలంటే 50 వేలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ సూచించారు. బాధితులు ఏసిబి ఆశ్రయించారు. సీన్ కట్ చేస్తే 50 వేలు లంచం తీసుకుంట్టున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారు. ఏసిబి అధికారులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.