సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రధాన్యత ఉందని, భారత రాజ్యాంగం ద్వారా మనకు గొప్ప అవకాశం లభించిందని ఆయన అన్నారు. ఓటు వేయడం మనందరి బాధ్యతని, దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేందుకు, ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.