ప్రజలను రెచ్చగొట్టి నీళ్లపై రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నల్లవాగు జలాశయం ఆయకట్టు రైతు లబ్ధిపొందాలని చూస్తున్నాడని, ఈ విధానం ఆయన మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గైని దేవదాస్ సూచించారు. ఉమ్మడి కల్హేర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీలో నల్లవాగు జలాశయం ఆయకట్టుకు పంటల విరామం ప్రకటించి కాలువల మరమ్మతులు చేపట్టారన్నారు. మరమ్మతులు లేని ప్రాంతాలైన రెండువేల ఎకరాలరే సాగునీరు విడు దల చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక కృషితో పనులు నాణ్యగా ఉండాలని పర్యవేక్షిస్తుంటే ఓర్వలేక ఆటంకాలు కల్పించడం తగదన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యాదవరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ వై. నర్సింహారెడ్డి, సాయిలు, గోపాల్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.