సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విగిపోయిందని సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో వసంతకుమారి ఆధ్వర్యంలో అవిశ్వాస సమావేశం నిర్వహించారు. సమావేశానికి కౌన్సిలర్ ఎవరు రాకపోవడంతో చైర్మన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ఆర్డీవో వసంత కుమారి ప్రకటించారు.
అవిశ్వాస తీర్మానంలో మనం నిరూపించుకోలేకపోయాం.. మా దాంట్లోనే మాకు వెన్నుపోటు పొడిచారు..
సంగారెడ్డి మున్సిపల్ అవిశ్వాస తీర్మానంలో బలం నిరూపించుకో లేకపోయామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెప్పారు. సంగారెడ్డి మున్సిపల్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన వారిలో కొందరు ప్రత్యర్థి వైపు వెళ్లినట్లు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ అవినీతి కారణంగానే తాము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు వివరించారు. నా దాంట్లోనే మాకు వెన్నుపోటు పొడిచారని సదరు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.