Saturday, November 23, 2024
HomeతెలంగాణSangireddy Niranjan Reddy appreciated young farmers: మీరే తెలంగాణ భవిష్యత్

Sangireddy Niranjan Reddy appreciated young farmers: మీరే తెలంగాణ భవిష్యత్

ఎంటెక్ చేసి బొప్పాయి సాగు, లండన్ ఉద్యోగం వదిలి అవకాడో పండిస్తున్నాడు

అందరికీ ఆదర్శంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులు నిలిచారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. తెలంగాణ భవిష్యత్ మీరేనంటూ మంత్రి యువ రైతులను ప్రత్యేకంగా అభినందించారు. ఎంటెక్ చదివి 10 ఎకరాలలో బొప్పాయి, జామ, దొండ, వరి సాగు చేస్తున్న ఎంటెక్ చదివిన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్ మియా గూడ యువరైతు అదీప్ అహ్మద్ ను ప్రశంసించారు. మొజాయిక్ వైరస్ తో బొప్పాయి సాగుకు రైతులు దూరమవుతున్నారని, దేశీ బొప్పాయి సాగుతో కేజీ రూ.30కి అమ్ముతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆదీప్ అహ్మద్ ను అందరూ అభినందించారు.

- Advertisement -

సివిల్ ఇంజనీరింగ్ చేసి లండన్ లో ఎంబీఏ చదివి ఉద్యోగం వదిలేసి ఎకరా 10 గుంటలలో అవకాడో పంట పండిస్తున్న కందుకూరు మండలం దెబ్బడగూడ తండా వాసి జైపాల్ నాయక్, ఎకరాకు రూ.5 నుండి రూ.10 లక్షల వరకు లాభాలు గడిస్తున్నారు. అవకాడో పంట సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు జైపాల్ నాయక్, యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్న కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.

లక్ష మంది సబ్ స్క్రైబర్లతో విజయవంతంగా రైతుల విజయాల ప్రచారం చేస్తుండగా, మీలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శమన్నారు. వ్యవసాయమే ఈ ప్రపంచ దిక్సూచి .. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుందన్నారు. సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలని, సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాలన్నారు. సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలి .. దానికి మీరు పునాదిరాళ్లు .. మీ నేతృత్వంలో మరింతమందిని ఇటు వైపు మళ్లించాలని ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన యువరైతులు అదీప్ అహ్మద్, జైపాల్ నాయక్ , యూ ట్యూబర్ శివకుమార్ లను అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సునంద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News