శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేతిలో మీదుగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణి , తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత. 1940 -44 మధ్యకాలంలో విస్నుర్ లో దేశ్ ముఖ్, రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగిన వీరమాత అని అన్నారు. ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటాలని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని అన్నారు. కాలే యాదయ్య మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి , పొద్దుటూరు గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి, ఎంపిటిసి ప్రవళిక వెంకట్ రెడ్డి,శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు పిఎసిఎస్సి శశిధర్ రెడ్డి బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sankarpalli: చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో మంత్రి సబిత
ఐలమ్మ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్న క్షణాలు