Friday, November 22, 2024
HomeతెలంగాణSankranthi: 11 రోజులు..2.82 కోట్ల మంది..165.46 కోట్ల ఆదాయం

Sankranthi: 11 రోజులు..2.82 కోట్ల మంది..165.46 కోట్ల ఆదాయం

11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చిన ఆర్టీసీకి..రూ. 165.46 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఆదాయం గత ఏడాది కన్నా రూ. 62.29 కోట్లు అదనంగా వచ్చినట్టు ఆర్టీసీ అధికారిక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు.

కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్‌) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది.

సాధారణ ఛార్జీలతోనే 3923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ఆరాంఘర్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్‌ బయోటాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News