Sankranti Holidays for Inter in TG: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 18 వరకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే ఏపీలో ఈ నెల 10 నుంచి 18 వరకు మొత్తం 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. తెలంగాణలో రేపటి నుంచి 16వ తేదీ వరకు మొత్తం 7 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు. ఈ క్రమంలో తాజాగా, ఇంటర్ కాలేజీలకు సైతం సెలవులు మంజూరు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 18 వరకు మొత్తం 8 రోజుల పాటు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యార్థులకు పండుగ సెలవులపై ప్రకటన వెలువడాల్సి ఉంది.

