Saturday, November 23, 2024
HomeతెలంగాణSarojini Devi eye hospital full with patients: సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి...

Sarojini Devi eye hospital full with patients: సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బాణాసంచ బాధితుల తాకిడి

పాపం..పండుగ పూట..

దీపాల పండుగ దీపావళి సందడిలో భాగంగా బాణాసంచా పేల్చే ప్రయత్నంలో భాగంగా వివిధ రకాలుగా ప్రమాదాలకు గురైన బాధితులు సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. గురువారం రాత్రి నుంచే బాధితులు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తున్నట్లు సమాచారం. పటాకులు కాల్చుతూ గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులు, మరో 45 మంది ఇతర వ్యక్తులు ఉన్నట్లు సరోజినీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. స్వల్ప గాయాలతో వచ్చిన 50 మందికి చికిత్స అందిస్తున్నట్లు సరోజినీ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని ప్రభాకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News