Thursday, January 22, 2026
HomeతెలంగాణTG: వరించిన అదృష్టం.. ఇద్దరికీ సమానంగా పోలైన ఓట్లు.. డ్రాలో దక్కిన సర్పంచ్ పదవి

TG: వరించిన అదృష్టం.. ఇద్దరికీ సమానంగా పోలైన ఓట్లు.. డ్రాలో దక్కిన సర్పంచ్ పదవి

Sarpanch post won in a draw in Medak District: గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓటింగ్‌ పూర్తవ్వగా.. కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కోటి వెలువడుతున్నాయి. ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ అభ్యర్థికి అనుకోని అదృష్టం దక్కింది. ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు రాగా.. డ్రాలో అనుకోని విజయం వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. ఈ గ్రామంలో మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి సునీత, బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి బీమిలి ఇద్దరికీ 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి నోటాకు పడింది. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ ఆఫీసర్‌ వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News