Thursday, April 10, 2025
HomeతెలంగాణSathupalli: ఐదు మండలాలకు 50 కోట్లు

Sathupalli: ఐదు మండలాలకు 50 కోట్లు

సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ అభివృద్ధికి..

సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో అభివృద్ధి పనులు విడుదలైన 50 కోట్ల రూపాయల నిధులకు రాష్ట్ర ప్రభుత్వానికి పనుల ప్రతిపాదనలు పంపగా మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలంలో ఆయా గ్రామాల్లో 90 పనులకు 9 కోట్ల 5 లక్షల రూపాయలు, పెనుబల్లి మండలంలో 140 పనులకు 10 కోట్ల 86 లక్షల రూపాయలు, వేంసూరు మండలంలో 127 పనులకు 7కోట్ల 73 లక్షల 50 వేల రూపాయలు, కల్లూరు మండలంలో 144 పనులకు 12 కోట్ల 77 లక్షల రూపాయలు, తలాడ మండలంలో 82 పనులకు 5 కోట్ల 85 లక్షల రూపాయలు, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 6 పనులకు 1 కోటి 85 లక్షల రూపాయలు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నీలాద్రి, ఇతర ఆలయాల అభివృద్ధికి 85 లక్షల రూపాయలు మంజూరు పనులకు అనుమతులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, డిసిసిబి డైరెక్టర్ చల్లగుళ్ళ కృష్ణయ్య, ఎంపీపీలు దొడ్డ హైమావతి శంకర్రావు, లక్కినేని వినిల్ అలేఖ్య, పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పిటిసిలు కూసంపూడి రామారావు, మారోజు సుమలత సురేష్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, యాగంటి శ్రీనివాసరావు, షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News