బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని లాల్ బహదూర్ స్టేడియం వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, 30 ఏళ్లపాటు కేంద్రమంత్రిగా – దేశానికి ఉప ప్రధానిగా ఎన్నో పదవులు నిర్వహించి పలు వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని,దళితుల- వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకమని, ఆయన చూపిన బాటలో నేటి యువత ముందుకు సాగాలని సూచించారు.
