Friday, April 11, 2025
HomeతెలంగాణSathupalli: కేసీఆర్, సండ్ర ఫోటోలకు పాలాభిషేకం

Sathupalli: కేసీఆర్, సండ్ర ఫోటోలకు పాలాభిషేకం

వీఆర్ఏ లు ఆనందోత్సవాలు అందరి ఆనందమే సీఎం లక్ష్యం, ఎంపీపీ పొగట్ల వెంకటేశ్వరరావు అన్నారు. అన్ని వర్గాల ప్రజల, ఉద్యోగుల ఆనందమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతుందని ఎంపీపీ పొగట్ల వెంకటేశ్వరరావు అన్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అందజేస్తూ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో నియమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవడంపట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చేపట్టిన పాలాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించిన ప్రధాతగా పేర్కొన్నారు. అనంతరం వీఆర్ఏలు ఆనందోత్సవాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ల చిత్రపటాలకు పాలాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలతో పాటు మారోజు సురేష్, దొడ్డ వెంకట కృష్ణారెడ్డి,కుక్కపల్లి నరసింహారావు, తక్కెళ్ళపాటి శేషయ్య,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News