సత్తుపల్లి నియోజకవర్గంలో పండిన వరి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలలో ధాన్యం సేకరణ పై కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ సివిల్ సప్లై, వ్యవసాయ అధికారులు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు, మిల్లులు కేటాయింపు తదితర విషయాలను సమీక్షలు చర్చించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ ప్రతి మిల్లులో 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకోవాలని, మిల్లులకు దిగుమతి కోసం వచ్చిన లారీలను వెంటనే దిగుమతి చేసుకొని తిరిగి పంపించే విధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అధికారులకు మిల్లర్లకు ఆదేశించారు. రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో Dso రాజేందర్, ADA సరిత, RDO సూర్యనారాయణ, AD నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.