Thursday, April 17, 2025
HomeతెలంగాణSathupalli: ఎమ్మెల్యే సండ్రకు మద్దతు తెలిపిన సత్తుపల్లి

Sathupalli: ఎమ్మెల్యే సండ్రకు మద్దతు తెలిపిన సత్తుపల్లి

సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి

సత్తుపల్లి పట్టణంలోని 6 వ వార్డులో ప్రజలు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యకి స్వచ్ఛందంగా వారి మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరై ప్రతిసారి ఆదరిస్తూ, మరోసారి ఆశీర్వదించడానికి మద్దతు తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో వార్డులో చేపట్టిన ప్రగతి పురోగతిని వారికి తెలిపి, మిగిలి ఉన్న వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, అత్మ ఛైర్మన్ వనమా వాసు, చిన్నంసెట్టి రాజ్యలక్ష్మి , షేక్ ఖాసిం సాహెబ్,కోనేరు నాని, మిరయం మధు, వెన్న సుధాకర్, షేక్ హుస్సేన్, బాషా, షేక్ ఇమామ్, శామిమ్, సుంకర వాసు, కృష్ణ, వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హనుమంతురావు, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు తదితర కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News