Tuesday, February 18, 2025
HomeతెలంగాణSathyavathi Rahod: నాగజ్యోతి గెలుపుకి కృషి చేస్తా

Sathyavathi Rahod: నాగజ్యోతి గెలుపుకి కృషి చేస్తా

తన నెల జీతంను విరాళమిచ్చిన మంత్రి

రానున్న శాసనసభ ఎన్నికలలో ములుగు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేస్తానని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నాగజ్యోతిని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్కో చైర్మన్ ఏరువా సతీష్ రెడ్డి, తదితరులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ తన నెల జీతం 3 లక్షల 50 వేల చెక్కు, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి నెల జీతాన్ని లక్ష 50 వేల రూపాయల చెక్కును నాగజ్యోతికి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నాగజ్యోతి గెలుపు కోసం తాము వెన్నంటే ఉంటామని గెలుపు కృషి చేస్తామని హామి ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News