Saturday, November 23, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: ఆర్థికంగా బలోపేతం అవుతున్న మత్స్యకారులు

Sathyavathi Rathod: ఆర్థికంగా బలోపేతం అవుతున్న మత్స్యకారులు

చెరువుల నిండా నీరు సమృద్ధిగా ఉండటంతో రైతులే కాకుండా మత్స్యకారులు కూడా చేపల ఉత్పత్తితో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి

నాడు చెరువులో నీరు ఉంటేనే మత్స్య సంపద పొందేవారని నేడు కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ కాలువల ద్వారా ప్రతి చెరువును నీటితో నింపడం మత్స్యకారులను సొసైటీలుగా ఏర్పర్చి బలపరచడం ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారిని నాగమణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, పార్లమెంటు సభ్యురాలు కవిత, మహబూబాబాద్, ఇల్లందు శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ , హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. నాడు వేసవికాలం వచ్చిందంటే చెరువుల ఎండి పోయేవని, నేడు మండుటెండలో కూడా మత్తడిపోస్తున్నాయన్నారు. సాగునీటి కొరత లేకుండా కాలేశ్వరం తెలంగాణకే తలమానికంగా నిలిచిందన్నారు. చెరువుల నిండా నీరు సమృద్ధిగా ఉండటంతో రైతులే కాకుండా మత్స్యకారులు కూడా చేపల ఉత్పత్తితో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయన్నారు.

- Advertisement -


చేప ఉత్పత్తి తోపాటు విక్రయాలను పెంచేందుకు నిరుపేద మత్స్యకారులకు వలలు, వాహనాలు అందిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటు అందించడం జరుగుతున్నది అన్నారు. జిల్లాలో 11వేల మంది మత్స్యకారుల కుటుంబాలు ప్రత్యేకంగాను 35 వేల కుటుంబాలు పరోక్షంగాను చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలియజేశారు. వీరికి ప్రమాద బీమా పథకం క్రింద ఐదు లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 19 మందికి 72 లక్షల రూపాయలు అందించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 22 కోట్ల విలువగల 26 కోట్ల చేప పిల్లలను 82,895 టన్నుల ఉత్పత్తితో మత్స్యకారులకు 2566 కోట్ల ఆదాయం రావడం జరిగిందన్నారు. చేప సంబంధిత వంటకాలను తయారుచేసి విక్రయిస్తూ ఆదాయం గడించాలని మహిళలకు సహకారం అందజేస్తామన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ నుండి రిజర్వేషన్ అందిస్తామని సబ్సిడీ ఇచ్చి మత్స్యకారుల కుటుంబాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చెరువులలో వేసవికాలంలో నీరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు అవకాశాలు కల్పిస్తామని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నదని అందులో భాగంగా గ్రామీణ మత్స్యకారుల అభివృద్ధికి గాను చేప విక్రయాలను పెంచి వారి జీవన ప్రగతి కి మార్గ నిర్దేశం చేస్తామన్నారు. చేప వంటకాలను రుచి చూపించి విక్రయాలు పెరిగే విధంగా ప్రోత్సహిస్తామన్నారు.


ఇల్లందు శాసన సభ్యురాలు హరిప్రియ మాట్లాడుతూ నేడు చెరువుల వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది అంటే అది తెలంగాణ ప్రభుత్వ ఘనకార్యం గా పేర్కొన్నారు. చేపల కొరకు నాడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడి ఉండేవారమని నేడు చెరువులు నిండుగా ఉండడంతో మత్స్యకారులు మత్స్య సంపదను విరివిగా పెంచడంతో చేపలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 81 లక్షలతో సొసైటీలను బలోపేతం చేశామని, 30 కోట్లు లబ్ధి పొందారని 100% మత్స్యకారులు విజయవంతంగా ముందడుగు వేస్తున్నారన్నారు. నీలి విప్లవం రాష్ట్రంలో ఆదాయ వనరుగా మిగిలిందని 76 వేల టన్నుల ఆదాయం సమకూరిందన్నారు. మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యశాఖ ప్రగతికి అభివందనలు తెలిపారు.
మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.ప్రతి చెరువులోనూ 10 నుండి 15 కిలోల చేపలు ఉన్నాయంటే అది మత్స్యకారుల ప్రతిభ అని తెలియజేశారు. కాకతీయుల కాలం నాటి చెరువులను తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో పటిష్టపరిచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది అన్నారు. మత్స్యకారులకు తన వంతు సహకారం అందించేలా కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేస్తానన్నారు.


అంతకుముందు మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్ట్ స్టాల్స్ లను ముందుగా మంత్రి సందర్శించి పరిశీలించారు. వివిధ రకాల చేప పిల్లల ప్రదర్శనశాలను తిలకించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆలపించిన గేయాలు ప్రేక్షకులను అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి నర్మద, సహకార శాఖ అధికారి ఖుర్షీద్, మార్కెటింగ్ శాఖ అధికారి వెంకట్ రెడ్డి, మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు గొడుగు శ్రీనివాస్, సహదేవ్, కౌన్సిలర్ వెంకన్నన్ మార్నేని వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News