భారత 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో గత తొమ్మిది సంవత్సరాలుగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నాయి. తెలంగాణా రాష్ట్రం అవతరించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2వ తేది నుండి 22 వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరిట 21 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ నాటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో మన రాష్ట్రం,మన జిల్లా సాధించిన ప్రగతిని సంక్షీప్తంగా మీకు తెలియజేయడం నా భాద్యత అన్నారు.
విద్య గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 2014వ సంవత్సరం నుండి నేటి వరకు మొత్తము, (19) ఆశ్రమపాఠశాలలు, (6) వసతి గృహాలు, (09) కళాశాల వసతి గృహాలు, (104) ప్రాథమిక పాటశాలల్లో 8 వేల 861 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్థున్నారు. వీరికి అదునాతనమైన విద్య బోదనలో భాగంగా ఈ స్కూల్ ప్రోగ్రాం, కంప్యూటర్ ల్యాబ్, మన టీవీ, డిక్షనరలు, అందించడం జరుగుతుంది. విద్యార్ధిని విద్యార్దులకు నాణ్యమైన బోజన వసతితో పాటు వారి ఆరోగ్య రక్షణకు ప్రతి నెల మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తామన్నారు.
తెలంగాణా రాష్ట్రం అవతరించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2వ తేది నుండి 22 వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరిట 21 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ నాటి స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా వివిధ రంగాల్లో మన రాష్ట్రం,మన జిల్లా సాధించిన ప్రగతిని సంక్షీప్తంగా మీకు తెలియజేయడం నాభాద్యతగా బావిస్తున్నాను.