Sunday, July 7, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తత అత్యవసరం

Sathyavathi Rathod: వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తత అత్యవసరం

తిరిగి పరిస్థితులు మామూలు స్థితికి చేరుకునే వరకు ..

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
గోదావరి మూడవ హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు, విద్యుత్ సమస్యలు లేకుండా వెంటనే మరమ్మతులు చేయండి
స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించండి అంటూ ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు, తక్షణ స్పందనతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామన్నారు. క్షేత్రస్థాయిలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత ప్రజలకు దగ్గరగా ఉండాలి
ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అన్నీ తానై ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సత్యవతి.

- Advertisement -

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనావేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గోదావరి మూడవ హెచ్చరికల నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆకస్మికంగా వరద పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ములుగు జిల్లా ప్రత్యేక అధికారి యస్. కృష్ణ ఆదిత్య, భూపాల పల్లి ప్రత్యేక అధికారి పి గౌతమ్, సెర్ప్, సి.ఈ.ఓ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో ములుగు జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో తిరిగి పరిస్థితులు మామూలు స్థితికి చేరుకునే వరకు వ్యాధులు ప్రబలకుండా బ్లీచ్, శానిటైజేషన్ చేయాలని తెలిపారు. వరద బాధితులు నిత్యవసరాలు అందించాలని వారికి అండగా ఉండాలని తెలిపారు. వరద ప్రవాహానికి దెబ్బతిన్న నీటి పైప్ లైన్లు, విద్యుత్ సౌకర్యాలు పునరుద్ధరించాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని సమకూర్చాలని సూచించారు. ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆహారం, మంచి నీరు, మెడికల్ క్యాంప్ ల ద్వారా మందులు అందించాలని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద ప్రవాహాలను గమనించాలని ఆదేశించారు.
గోదావరి బ్యాక్ వాటర్ ముంపుకు గురి కాకుండా లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు అవసరమైతే వెంటనే తరలించాలని అన్నారు. జిల్లాలోని అధికారులు, సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని, ముంపు ప్రాంతాలలో పర్యటించాలని ప్రజల మధ్య ఉండాలని అన్నారు. జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికి పైప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాటి కారణంగా వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైతే విద్యుత్ సరఫరా అంతరాయం సమస్యలు వచ్చయో వెంటనే పునరుద్ధరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్ లో ములుగు జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News