Saturday, November 23, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: మహిళా సంక్షేమంలో దేశానికి ఆదర్శం

Sathyavathi Rathod: మహిళా సంక్షేమంలో దేశానికి ఆదర్శం

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న ఉద్దేశంతో విలేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యక్రమంతో వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు కేసముద్రం చేరుకున్న మంత్రి సత్యవతిరాథోడ్ డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు. మహిళలతో కలిసి ర్యాలీగా నడుచుకుంటూ మార్కెట్ యార్డుకు చేరుకున్న మంత్రి.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం. 9 ఏండ్లలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా పథకాల అమలు. త్వరలో గృహలక్ష్మి పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం. మార్కెట్‌ కమిటీల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఉద్యోగిణులకు ప్రసూతి సెలవులనూ పెంచి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న ఉద్దేశంతో విలేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యక్రమంతో వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా రుణాలను ఇస్తూ జీవనోపాధిని కల్పిస్తున్నది.

- Advertisement -


గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు ఇప్పుడు పరిస్థితులు మారాయి అన్నారు. ముఖ్యమంత్రి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారనీ, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని గౌరవ సీఎం కేసీఆర్‌ నమ్మి మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనీ. గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందివ్వడంతో ఆరోగ్యం, డెలివరీ ప్రభుత్వ దవాఖానలో జరగడంతో కేసీఆర్‌ కిట్టుతో పాటు 16 రకాల నిత్యావసర సరుకులు, రూ.13వేల ఆర్థికసాయం అందిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో 30 శాతం ఉన్న ప్రసవాలు 60 శాతానికి పెరిగాయనీ, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసిఆర్ కిట్, న్యూటీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్‌ఆర్, షీ టీమ్స్, వి హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు పెంచిన ఘనత గౌరవ సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. ఎనిమిదేళ్ల క్రితం ఆశ కార్యకర్తగా 750 వేతనంతో ఇబ్బందులు, ఇప్పుడు 9,750 వేతనంతో సంబురాలు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా ఉద్యోగులు వేతనాలు 150 శాతం పెంచామన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు 2014లో నెలకు 4,500 మాత్రమే ఇచ్చేవారు. ఇపుడు వీరి వేతనం 13,650 అందించాం.


మహిళా సంక్షేమ కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, మార్కెట్ కమిటీ చైర్మన్ సుహాసిని, డాక్టర్ సీతా మహాలక్ష్మి, ఎంపీపీ సుజాత, జడ్పిటిసిలు, ప్రియాంక, శ్రీనాధ్, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News