Friday, April 4, 2025
HomeతెలంగాణSavithribai Pule: సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయం

Savithribai Pule: సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయం

సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలంటూ పిలుపు

సంఘ సంస్కర్త, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు పిఎసిఎస్ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ లు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని గార్ల మండలం కేంద్రంలోని స్థానిక సావిత్రి బాయి పూలే విగ్రహాల వద్ద ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించి సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే మహిళల విద్యాభివద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బాపనపల్లి సుందర్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ యాకుబ్ పాషా గులగట్టు లెనిన్ వార్డు సభ్యులు పల్లె పంగు నాగరాజు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు పిల్లలమర్రి వీరస్వామి మోత్కూరి సాగర్ కడియం వెంకన్న జాంగిర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News