Telangana Holidays:సెప్టెంబర్ నెల మొదటి వారంలో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. ఇప్పటికే పాఠశాలలు కొత్త టర్మ్‌లో కొనసాగుతున్న తరుణంలో ఈ విరామం చిన్నారులకు, విద్యార్థులకు ఆనందాన్ని కలిగించనుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేర్వేరు కారణాలతో ఈ సెలవులు అమల్లోకి వస్తున్నాయి.
మిలాద్ ఉన్ నబీ..
మొదటగా సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వాలు పబ్లిక్ హాలీడే ప్రకటించాయి. ఈరోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
ప్రత్యేకంగా సెలవు..
తదుపరి రోజు అయిన సెప్టెంబర్ 6న హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా సెలవు ఇస్తారు. ఈ సెలవు కారణం వినాయక నిమజ్జనాలు. ప్రతీ సంవత్సరం లాగా ఈసారి కూడా నగరంలో భారీ స్థాయిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. నిమజ్జనాలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ భారం తగ్గించేందుకు, భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం మేరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అయితే ఈ సెలవు కేవలం హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో ఆ రోజు సాధారణ విద్యా కార్యకలాపాలు కొనసాగుతాయి.
వరుసగా మూడు రోజులు…
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సెప్టెంబర్ 6న స్కూళ్లకు సెలవు ఇవ్వరని తెలుస్తోంది. ఇక 7వ తేదీ ఆదివారం కావడంతో ఎలాగూ ప్రతి వారం లాగే సెలవు లభిస్తుంది. దీనితో వరుసగా మూడు రోజులు విద్యార్థులకు సెలవులే..సెలవులు.
Also Read: https://teluguprabha.net/career-news/indian-women-set-record-in-global-mba-admissions/


