చేగుంట మండల కేంద్రంలోని దీప్తి విద్యాలయంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని, వారి ప్రతిభకు తగినట్లుగా వివిధ విజ్ఞాన ప్రదర్శనలు చేశారు. ఇందులో భాగంగా సోలార్ సిస్టం సాటిలైట్ అండ్ ప్లానెట్స్ మొదలు సైన్స్ విజ్ఞానంతో పాటు సబ్జెక్టుల వారిగా కళా నైపుణ్యాలను కూడా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ కే కృపవరం మాట్లాడుతూ 1984 సంవత్సరంలో దీప్తి విద్యాలయాన్ని ప్రారంభించానని అప్పటి నుండి నేటి వరకూ ఏ కార్యక్రమమైనా తప్పకుండా పాఠశాలలో నిర్వహిస్తానని వారు అన్నారు. విజ్ఞాన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చిన్న వయసులోనే సైన్స్ పట్ల అవగాహన చేపట్టినట్లయితే రేపు వారు దేశానికి సివి రామన్ లా తయారవుతారని సందేశం ఇచ్చారు.