Friday, January 16, 2026
HomeతెలంగాణSpecial trains : సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్లు సిద్ధం, రేపటి నుంచే అడ్వాన్స్...

Special trains : సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్లు సిద్ధం, రేపటి నుంచే అడ్వాన్స్ బుకింగ్!

SCR Sankranti special trains : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త! పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన రైళ్లలో టికెట్లు ‘రిగ్రెట్’ చూపుతున్న వేళ, ఈ ప్రత్యేక రైళ్ల ప్రకటన ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చింది. ఈ రైళ్లలో అడ్వాన్స్ రిజర్వేషన్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది. 

- Advertisement -

జనవరి 14న సంక్రాంతి పండుగ కావడంతో, జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ప్రయాణాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లలో, టికెట్లు నెల రోజుల క్రితమే పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ కూడా దాటిపోయి, ‘రిగ్రెట్’ ఆప్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు, దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం : “సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా, ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం. వీటిలో అడ్వాన్స్ బుకింగ్ ఆదివారం (రేపు) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది,” అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పొడిగించిన వీక్లీ రైళ్లు : ప్రత్యేక రైళ్లతో పాటు, ప్రయాణికుల సౌకర్యార్థం, ఇప్పటికే నడుస్తున్న కొన్ని వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను కూడా జనవరి నెలలో మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
సికింద్రాబాద్-అనకాపల్లి (07041/07042)
హైదరాబాద్-గోరఖ్‌పూర్ (07075/07076)

జన్మభూమి’ వేళల్లో మార్పు : మరోవైపు, విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) రైలు ప్రయాణ వేళలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త వేళలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి.

విశాఖ-లింగంపల్లి (12806): విశాఖలో ఉదయం 6:20కి బయలుదేరి, లింగంపల్లికి రాత్రి 7:15కి చేరుకుంటుంది.
లింగంపల్లి-విశాఖ (12805): లింగంపల్లిలో ఉదయం 6:55కి బయలుదేరి, విశాఖకు రాత్రి 7:50కి చేరుకుంటుంది. పండగకు ఊరెళ్లే వారు, తక్షణమే ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవాలని, చివరి నిమిషం వరకు వేచి ఉండి ఇబ్బంది పడవద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News