తెలంగాణ సెక్రెటేరియట్ కొత్త బిల్డింగ్ ను సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడు ప్రారంభించనున్నారు. ఈమేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన సీఎం కేసీఆర్ బర్త్ డే రోజు సెక్రెటేరియట్ అధునాతన భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం అంగరంగ వైభవంగా సాగేలా భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. అంబేడ్కర్ సెక్రెటేరియట్ పేరుతో ఈ కొత్త భవన సముదాయాన్ని పిలుస్తున్నారు. అత్యాధునిక స్టైల్లో, సకల హంగులతో, భారీ బడ్జెట్ తో కనివినీ ఎరుగని రేంజ్ లో ఈ భవన నిర్మాణం సాగటం విశేషం. సచివాలయం కోసం ఇంత భారీ బడ్జెట్ వెచ్చించటంపై ఎన్ని విమర్శలు ఏ స్థాయిలో వచ్చినా వాటన్నిటినీ ఖాతరు చేయకుండా కేసీఆర్ కొత్త భవాన్ని నిర్మించేందుకే మొగ్గు చూపారు.