తెలంగాణ సచివాలయంలో(TG Secretariat)మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఇద్దరు నకిలీ ఉద్యోగులు సెక్రటేరియట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సచివాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో ఇద్దరు నకిలీ ఉద్యోగులు ఆరో అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
- Advertisement -
అయితే ఈ విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తపడ్డారని తెలుస్తోంది. ఆ నకిలీ ఉద్యోగులు ఎందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారో మాత్రం తెలియరాలేదు. సెక్యూరిటీ వైఫల్యం వల్లే తరచూ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.