ప్రజల పక్షపాతి, పౌర హక్కుల ఉద్యమకారుడు, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి ఎన్ సాయి బాబా మృతి పట్ల మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. సమాజంలో అసమానతను రూపుమాపేందుకు జీవితాంతం పోరాడిన మానవతావాది సాయిబాబా అని ఆయన సేవలను మంత్రి సీతక్క గుర్తు చేసుకున్నారు. తప్పుడు కేసుల్లో సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితాన్ని అనుభవించినా.. మొక్కవోని సంకల్పంతో చివరి వరకు నిబద్ధతతో ప్రజల కోసం సాయిబాబా పని చేసారని సీతక్క పేర్కొన్నారు. సాయిబాబా ఎంచుకున్న పంథాతో అందరూ ఏకీభవించకపోయినా..ఆయన సిద్ధాంత పటిమ, చిత్తశుద్ధితో ఆయన అంటే అందరికీ ప్రత్యేక అభిమానమని తెలిపారు. సాయిబాబా మృతి పట్ల ప్రగాడ సంతాపం తెలిపిన మంత్రి సీతక్క, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.
Seethakka condolence on Prof Saibaba demise: ప్రొఫెసర్ సాయి బాబా మృతి పట్ల మంత్రి సీతక్క సంతాపం
సంతాపం..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES