Sunday, July 7, 2024
HomeతెలంగాణSeethakka demands: రోడ్ల మరమ్మతులు చేయాలి

Seethakka demands: రోడ్ల మరమ్మతులు చేయాలి

ములుగు సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే

ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని,పెండింగ్ లో ఉన్న పి.ఆర్, ఆర్&బి,ఐటిడిఏ రోడ్లు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. హైదరాబాదులో రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ములుగు ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ లను కలిసి పలు సమస్యలు వివరించిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ములుగు నియోజక వర్గంలో అపార అస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లిందని, రోడ్లు వాగులు వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై అనేక గ్రామాలు నీట మునిగి ప్రజలు సర్వసం కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపుకు గురైన ప్రజలు ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారని, ముంపుకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. లోతట్టు గ్రామాల ప్రజలకు ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్ కట్టించి వరుదల్లో కొట్టుకుపోయి మరణించిన మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ పనులలో నిర్లక్షంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని త్వరితగతిన పనులు ప్రారంభించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సీతక్క కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News