జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మించి ఇవ్వాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. జిల్లాలోని మంగపేట మండలానికి చెందిన పాత్రికేయులతో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మంగపేట మండలం లోని వర్కింగ్ జర్నలిస్ట్ లు గత 30 సంవత్సరాలుగా ఇంటి స్థలాలు కావాలని పోరాటం చేస్తున్నారని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజల పక్షాన ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతూ ఎలాంటి జీత భత్యాలు లేకుండా స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సబబు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా తో పాటు మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్ట్ లు ఉన్నారు.