ఏటూరు నాగారంను రెవిన్యూ డివిజన్ గా క్యాబినెట్ తీర్మానించడం పట్ల మంత్రి సీతక్క హర్షం
క్యాబినెట్ సహచరులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
ప్రజల సుదీర్ఘ కల ఫలించిందంటూ వ్యాఖ్య
ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ప్రకటనతో అభివృద్ధి పరుగులు పెట్టడంతో పాటు ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందన్న సీతక్క
మంగపేట, తాడ్వాయి, ఎటురూ నాగారం, వెంకటాపూర్, వాజేడు కన్నాయిగూడెం మండల ప్రజలకు తప్పనున్న ప్రయాణ భారం
అందుబాటులోకి రానున్న అధికారులు
రెవెన్యూ డివిజన్ గా మారనుండటంతో ఏటూరు నాగారంలో అంబరాన్ని అంటిన సంబరం
టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రజలు
….
ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కి 211 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీతక్క
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, భూములు కేటాయించకపోవడం తో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యమైందన్న సీతక్క
తన సొంత నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కానునడంతో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి సీతక్క
యూనివర్సిటీకి అవసరమైన భూమిని త్వరగా కేటాయించే విధంగా వ్యవరించిన సీతక్క
కేటాయింపుకు సంబంధించిన నోట్ ఫైల్ ను తానే స్వయంగా పర్యవేక్షించిన సీతక్క
నోట్ ఫైల్ ను సిద్ధం చేయడం నుంచి.. క్యాబినెట్ తీర్మానం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీతక్క
యుద్ధ ప్రాతిపదికన పలు శాఖల నుంచి అవసరమైన అనుమతులు తెప్పించిన సీతక్క
రెవెన్యూ మంత్రి, సీఎం, ఇతర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి భూముల అప్పగింత పై క్యాబినెట్లో ఆమోదముద్ర వేయించిన సీతక్క