రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర, వుందని, అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందన్న మంత్రి సీతక్క..తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయమేనని గుర్తు చేశారు. అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర, ప్రజలు క్షమించరని, రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం కేంద్రాలున్నాయని, లక్నవరం, బొగత, సమ్మక్క సారలమ్మ దేవాలయం వంటి ఎన్నో చారిత్రక ప్రాంతాలు ములుగులో ఉన్నాయన్నారు.
అక్కడ కేంద్రీయ గిరిజ యూనివర్సిటీ కాబోతోందని, అందుకే రామప్ప చుట్టుపక్కల సహజత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. రామప్ప వారసత్వ సంపద గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు ప్రపంచ దేశాలకు చాటి చెప్పే యజ్ఞంలో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలన్నారు మంత్రి. ఎక్కడ లోపల జరగకుండా అభివృద్ధి పనులు జరగాలని, అభివృద్ధి పనుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా నా దృష్టికి తీసుకురావాలన్నారు.
సీతక్క ఎల్లపుడూ అందుబాటులోనే ఉంటారని, మంత్రి హోదాల్లో వున్నంత మాత్రానా దూరం అయినట్లు కాదని, ఏ సమస్య వచ్చినా సంప్రదించవచ్చన్నారు. రామప్ప దేవాలయంతో పాటు, రామప్ప చెరువు, ఆ చుట్టు పక్క ప్రాంతాల ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. రామప్ప చెరువు, దేవాలయంకి ఆటంకం కలిగించే అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వమన్నారు మంత్రి సీతక్క.