Monday, October 14, 2024
HomeతెలంగాణSeethakka sudden visit in TG foods: టీజీ ఫుడ్స్‌లో మంత్రి సీత‌క్క ఆక‌స్మిక త‌నిఖీ

Seethakka sudden visit in TG foods: టీజీ ఫుడ్స్‌లో మంత్రి సీత‌క్క ఆక‌స్మిక త‌నిఖీ

జాగ్రత్తలు పాటించాల్సిందే..

అంగ‌న్వాడీ కేంద్రాల‌కు బాలామృతం స‌హా ప‌లుర‌కాల ఆహారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తున్న నాచారం తెలంగాణ ఫుడ్స్ కార్యాలయాన్ని, కర్మాగారాన్ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క సోమ‌వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను ప‌రిశీలించారు. ప‌రిస‌రాలు మ‌రింత‌ ప‌రిశుభ్రంగా ఆమె సిబ్బందిని ఆదేశించారు. ఆహార పదార్థాలు, స్టోరేజ్ పాత్రలపై మేష్ లు బిగించాలని ఆదేశాలు.
శుభ్రతను పాటించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శుద్ధిచేసిన ఆహార పదార్థాలను తక్షణం కవర్ చేసేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాల నాణ్యతపై లాబ్ నివేదికను తనకు సమర్పించాలని మంత్రి సీతక్క చెప్పారు. అంగన్వాడీలకు ఇక్కడి నుంచి ఫుడ్ సప్లై అవుతున్నందున చిన్నారుల భవిష్యత్తు దృష్టిలో శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సిబ్బందికి ఆమె సూచించారు.

- Advertisement -

అనంత‌రం ఆమె ఆహార పదార్థాల శుద్ధి ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించి ప‌ని విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.సాంకేతిక లోపంతో నెల రోజులుగా స్నాక్ ఫుడ్ యూనిట్ ప‌నిచేయ‌క పోవ‌డంపై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మరమ్మతులు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధికారులు సిబ్బందిని ఆమె ప్ర‌శ్నించారు.

కొత్త యూనిట్ పనులు పదేళ్లుగా పూర్తికాకపోవడంపై మంత్రి సీతక్క ఆశ్చర్యపోయారు. యంత్రాలను త్వరగా బిగించాల‌ని ఆదేశించారు. బడ్జెట్ వివరాలు, ఖర్చులు వ్యయాలు, ఇబ్బందులు సమస్యలు, ఉన్నత స్థాయి సిబ్బంది అర్హత, అనుభవం, ఎంతకాలంగా టీజీ ఫుడ్స్ లో ఏ స్థాయిలో పనిచేస్తున్నార‌నే సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.

అందుకు అనుగుణంగా త్వరలో టీజీ ఫుడ్స్ పనితీరు పై సమీక్ష చేస్తానని ఆమె అన్నారు. మంత్రి సీతక్క వెంట టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫాయిం ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News