తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi Kumari) సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె త్వరలోనే వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆమె నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సీఎస్‌ను ఎంచుకునే పనిలో నిమగ్నమైందని సమాచారం. శాంతికుమారి స్థానంలో సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియమితులు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాగా 1990 ఐఏఎస్ బ్యాకి చెందిన రామకృష్ణారావు గతంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అధికారుల్లో శశాంక్ గోయల్ తరువాత రామకృష్ణారావు సీనియర్ అధికారిగా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఈయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రామకృష్ణారావు వైపు మొగ్గు చూపుతున్నారట.