Saturday, November 15, 2025
HomeతెలంగాణGroup-1 Issue: గ్రూప్-1పై హైకోర్టు సంచలన తీర్పు.. మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశం

Group-1 Issue: గ్రూప్-1పై హైకోర్టు సంచలన తీర్పు.. మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశం

Telangana High Court on Group-1 issue: గ్రూప్-1 ఫలితాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1పై దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. గ్రూప్-1ను మళ్లీ నిర్వహించాలని తెలిపింది. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

రీవాల్యూయేషన్ సాధ్యం కాకపోతే: రీవాల్యూయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి తెలిపింది. ఈరోజు నుంచి 8 నెలల లోపు రీవాల్యూయేషన్ చేపట్టాలని.. సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. కాగా.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై జూలైలో తుది వాదనలు జరగ్గా.. కోర్టు తీర్పును ఈ రోజు ప్రకటించింది.

ఆందోళనలో ఎంపికైన అభ్యర్థులు: హైకోర్టు తీర్పుతో గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే సర్టిఫికెట్ల ధృవీకరణ పూర్తయి.. తుది నియామక పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దశలో హైకోర్టు తీర్పు.. గ్రూప్-1 అభ్యర్థుల్లో ఆందోళనను రేకెత్తించింది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే టీజీపీఎస్సీ సమీక్ష చేపడుతుందని సమాచారం. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం ఉంటుందోనన్న ఉత్కంఠ నిరుద్యోగుల్లో నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad