ఓ కేసు పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు వెలువించింది. కోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు ఏకంగా రూ.కోటి భారీ జరిమానా విధించింది. గతంలో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ విషయం దాచి వేరే బెంచ్ వద్ద పిటిషన్లు దాఖలు చేయడంపై న్యాయమూర్తి నగేశ్ భీమపాక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పిటిషనర్‌కు కోటి రూపాయలు ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంచలన తీర్పు న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.