Saturday, April 12, 2025
HomeతెలంగాణSerilingampalli: ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

Serilingampalli: ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు శేరిలింగంపల్లిలో BRS పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మియాపూర్ లోని BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం పలు కాలనీ లో అవతరణ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా దశబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

తెలంగాణ ఏర్పాడు పది ఏళ్ల కాలంలో అద్భుతమైన అభివృద్ధి సాధించిన ఘనత బిఆర్ఎస్-కెసిఆర్ కే దక్కుతుందని అయన అన్నారు… అభివృద్ధి విషయంలో దేశానికి మార్గాన్ని తెలంగాణ చూపించిందని అయన అన్నారు… రైతులకు ఉచితంగా 24గంటలు కరెంటు ఇచ్చి ఆదుకున్నది కెసిఆర్ ప్రభుత్వం అని అయన తెలిపారు… అన్ని వర్గాల అభివృద్ధి, తెలంగాణ ను దేశంలో నెంబర్ వన్ గా తీర్చాధిద్దాం అని అయన మరోసారి స్పష్టం చేసారు… రాబోయే రోజుల్లో మరోసారి బిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడతారని అయన ఈ సందర్బంగా తెలిపారు… ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు మల్లికార్జున శర్మ, రాజు యాదవ్, శేఖర్ గౌడ్, షరీఫ్, సంగారెడ్డి, విశేశ్వరరావు, అశోక్ తదితరులు పాల్గొన్నరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News