Monday, April 7, 2025
HomeతెలంగాణMLCs Oath: తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం

MLCs Oath: తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం

ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీ(MLC)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ లతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Sukhender Reddy) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు మల్కా కొమురయ్య, అంజి రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావులు పాల్గొన్నారు. అలాగే నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News