Saturday, October 5, 2024
HomeతెలంగాణShadnagar: షాద్ నగర్ బీజేపి అభ్యర్థిగా అందె బాబయ్య

Shadnagar: షాద్ నగర్ బీజేపి అభ్యర్థిగా అందె బాబయ్య

ఈటెల ఆశీర్వాదంతో బాబయ్యకు అందలం

షాద్ నగర్ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల బరిలో రంగప్రవేశం చేయబోతున్నారు. సామాజిక వర్గానికి చెందిన అందే బాబయ్యకు బిజెపి అధినాయకత్వం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో షాద్నగర్ అసెంబ్లీ టికెట్టు భాజపా తరఫున వరించింది. గత 40 ఏళ్ల పాటు వివిధ పార్టీలలో వివిధ హోదాలలో పనిచేసిన అందే బాబయ్య రాజకీయ శ్రేయోభిలాషిగా పేరు పొందారు. పార్టీలకతీతంగా అందేబాబయ్యను అభిమానిస్తారు. బీఆర్ఎస్, టీడీపీ పార్టీలలో రాష్ట్రస్థాయి హోదాలలో పనిచేసిన బాబయ్య ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోసం ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో కలిశారు. సామాన్యుడి సైతం అసెంబ్లీ బరిలో నిలిచి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కేవలం భాజపకే సాధ్యమవుతుందన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. తన నియామకం కోసం విశేషంగా కృషిచేసిన ఈటెల రాజేందర్ కు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ గద్వాల డీకే అరుణమ్మ తదితరులకు బాబన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం అలాగే తన గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల కష్టసుఖాలు తనకు తెలుసునని, ప్రజల సంతోషమే తన ప్రాథమిక లక్షణం అని అన్నారు. తను సుప్రయోజనాల కోసమో.. లేక స్వార్థ రాజకీయాల కోసమో రాలేదని.. నిజాయితీగా నిస్వార్ధంగా నిక్కసిగా ప్రజాసేవకు పునరంకితమవుదామనే ఏకైక లక్ష్యంతో తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. తన జీవితం ప్రజల కోసం తన శ్వాస ప్రజల కోసం తన ఊపిరి ప్రజల కోసం తన సేవలు ప్రజల కోసం తానున్నది ప్రజల కోసమేనని ఈ సందర్భంగా అందే బాబయ్య తన మనోభావాన్ని, పరమార్ధాన్ని మీడియా ముందు వెల్లడిస్తున్నానని తెలిపారు. అంతే బాబాయ్ కు భాజపా టికెట్టు రావడం పట్ల ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు స్థానిక చివరస్తలో బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించారు. జై బిజెపి జై జై బిజెపి.. కాబోయే ఎమ్మెల్యే అందరి బాబయ్య ముదిరాజ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News