షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లో విద్యార్థుల కోసం నిర్వహించిన యువత కోసం మేము సైతం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..పిల్లల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామం, విద్యార్థుల భవిష్యత్తుకై శిక్షణ నైపుణ్య కార్యక్రమాలను విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన శిక్షకుడు సేవక్ కుమార్ , నిర్వాహకులు పెంటన్న, కె కె కృష్ణ, దర్శన్ ని అభినందించారు.
పేద విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టుగా సామెత ఏదైతే ఉన్నదో బాల్య దశ బంగారు దశ ఈ దశలో మంచి అలవాట్లు నేర్చుకుంటే వారు చైతన్య వంతులుగా తీర్చిదిద్దితే సమాజంలో ఒక మంచి యువతగా తయారవుతారు. ఇలాంటి నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేయడం వలన వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, అక్రమ్,అందెమోహన్ మరియు యువకులు శ్రీను, రాజు, అశోక్, ఆకాష్, బుగ్గారెడ్డి హాస్పిటల్ ఉద్యోగస్తులు,అని పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.