Sunday, July 7, 2024
HomeతెలంగాణShadnagar: బాధితులకు ఎమ్మెల్లే అంజన్న అభయ హస్తం

Shadnagar: బాధితులకు ఎమ్మెల్లే అంజన్న అభయ హస్తం

ఇండ్లు కోల్పోయిన 19మందికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

అధిక వర్షాలతో షాద్ నగర్ నియోజకవర్గంలో కూలిన ఇండ్లను షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పరిశీలించారు. నియోజక వర్గంలోని ఉమ్మడి కొందుర్గు మండలం జిల్లేడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. 19 మంది బాధితులకు సొంత ఖర్చులతో ఆర్థిక సాయం అందజేయడంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మండలంలోని ఇంద్రానగర్, ఎదిర , చౌదరిగూడ గ్రామాలలో వర్షాల ప్రభావానికి ఇండ్లు కూలిన బాధితులను స్వయంగా కలుసుకున్నారు. వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు నిత్యవసర సరుకులను ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు వర్షాభావ పరిస్థితుల వల్ల పేదల ఇండ్లు కొన్ని పాక్షికంగా మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయని వాటిని గుర్తించి అధికారులకు నివేదించామని తెలిపారు నియోజకవర్గంలో చాలా చోట్ల వర్షాలకు కూలిన ఇండ్లకు గృహలక్ష్మి ద్వారా సాయం అందిస్తామని మరొసారి గుర్తు చేశారు ప్రభుత్వం ఎల్లవేళలా పేద ప్రజల పక్షాన నిలిచి ఉంటుందని అన్నారు ప్రభుత్వం ఆడపా దడపా కాకుండా ప్రతినిత్యం పేద ప్రజలను ఏదో రకంగా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలే కాదు నిత్యం ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి మౌలిక సదుపాయాల రూపకల్పన అదేవిధంగా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఎవరికి ఏ కష్టం రానివ్వమని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వర్షాభావ పరిస్థితులకు దెబ్బతిన్న బాధితులకు గృహాలక్ష్మి ద్వారా ఆదుకుంటామని మరోసారి స్పష్టం చేశారు మండల బీఆర్ఎస్ శ్రేణులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News