సద్దుల బతుకమ్మ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, స్వయంగా పాల్గొని షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు దసరా, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నేడు పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరులతో నిండైన బతుకమ్మను తలపిస్తోందని ఈ సందర్భంగా వై.అంజయ్య యాదవ్ అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
తెలంగాణ షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని అంజయ్య యాదవ్ అన్నారు. పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతా భావనను తెలియజేస్తుందని అంజయ్య యాదవ్, అభివర్ణించారు.
సబ్బండ వర్గాల ప్రజలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని షాద్ నగర్ శాసనసభ్యులు వై. అంజయ్య యాదవ్. తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాజీ శాసనసభ్యులు బక్కని నర్సింలు, దసరా ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ, దసరా పండుగ మనిషిని మంచిమార్గంలో నడిపించడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని, తొమ్మిది రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్న ప్రజలు విజయదశమిని దసరా ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.