Saturday, November 23, 2024
HomeతెలంగాణShamshabad: అంగన్వాడీ సమ్మెకు బీజేపీ మద్దతు

Shamshabad: అంగన్వాడీ సమ్మెకు బీజేపీ మద్దతు

17 రోజులుగా సాగుతున్న సమ్మె

అంగన్వాడి ఉద్యోగులు గత 17 రోజులుగా న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించాలని శాంతియుతంగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా శంషాబాద్ మండల కార్యాలయం దగ్గర జరుగుతున్న సమ్మెలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్ పాల్గొని, సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మల్లేష్ బత్కు శ్రీనివాస్ యమ్మ కుమార్ బైతీ అనిల్ తదితరులు పాలగొన్నారు. ఈ సందర్భంగా బిజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతీ శ్రీధర్ మాట్లాడుతూ… అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. పసిపిల్లలకు వీళ్ళు చేసే సేవకు జీతంతో వెలకట్టలేమని అన్నారు. వాళ్లను వెంటనే గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, టీచర్లకు కనీస వేతనం 26000, లేబర్లకు 16,000 మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు, లేబర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు అని అన్నారు.
మీరు ఇచ్చే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్లకు ఎవరిమీద ఆధారపడకుండా ఒక భరోసా వస్తుందని అన్నారు. అనేక రాష్ట్రాలలో అక్కడికి పరిస్థితులకు అనుకూలంగా జీతాలు ఇస్తున్నారని, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఎందుకు ఇవ్వదు? అని ప్రశ్నించారు. సకలజనుల సమ్మెతో తెచ్చుకున్న తెలంగాణలో అసలు సమ్మేలే ఉండవద్దు అన్నారు కదా కేసీఆర్ గారు, మరి నిన్న మొన్నటిదాకా గ్రామ పంచాయతీ సెక్రటరీల సమ్మె, ఆర్టీసీ సమ్మె, ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె ఎందుకు జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు బి ఎల్ ఓ లు గా బాధ్యతలు ఇచ్చారు కదా, ప్రజలు మీకు సుపరిచితమే కెసిఆర్ ప్రజలకు చేసిన మోసాలను ఇంటింటికి తెలియజేసి ప్రజలను చైతన్యం చేస్తే గాని, ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించే వరకూ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News