Shocking scenes at Kurnool bus accident: కర్నూలు ప్రమాదం వద్ద షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలిబూడిదైన మృతదేహాలను అధికారులు గుర్తించి.. ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతే కాకుండా అధికారులు బస్సు ప్రమాద ఘటన వద్ద క్షుణ్ణంగా పరిశీలించి.. విచారణ నిమిత్తం అక్కడి వస్తువులను తరలించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ప్రమాద ఘటన స్థలికు దగ్గరలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు దురాశ పుట్టింది. అయితే వారు ఆ ప్రమాదంలో చేసిన పనికి .. జనాలు బిత్తరపోయారు. ప్రస్తుతం ఆ షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కుటుంబాలు ఏం చేశాయో తెలిసుకుందాం.
నివ్వెరపోయే దృశ్యాలు: కర్నూలు బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో వారు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు సైతం మంటల్లో పూర్తిగా కరిగి బుడిదైనాయి. అయితే ఆ ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే దురాశతో.. మహబూబ్‌నగర్‌కు చెందిన కొన్ని కుటుంబాలు బుధవారం బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. బూడిదను సంచుల్లో సేకరించి, ప్రమాద స్థలికి దగ్గరలో గల ఓ కుంట వద్దకు తీసుకెళ్లారు. వాటిని నీటిలో కడిగి మరీ పరీక్షిస్తున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపగా.. వీళ్లు మాత్రం ఆశ చంపుకోలేక ఇలా దూరప్రాంతం నుంచి రావడం అందరినీ నివ్వెరపోయేలా చేస్తుంది. జనాలు ఇలా కూడా ఉంటారా అని .. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కోడైకూస్తున్నారు.
Also read:https://teluguprabha.net/crime-news/kurnool-bus-accident-case-police-arrested-driver-lakshmaiah/
డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్: కర్నూలు ప్రమాద కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 19 మంది సజీవ దహనానికి కారణమైన ఏ1 నిందితుడు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య ఏ2 నిందితుడైన బస్సు యజమాని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. మంళవారం అర్ధ్రరాత్రి డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు. మిరియాల లక్ష్మయ్యకు అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. లక్ష్మయ్య కేవలం 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ.. టెన్త్ ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి ఈ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మయ్య లైసెన్స్ జారీ వెనుక ఉన్న అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బస్సు యజమానిని అరెస్టు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


