అమెరికాలో మరోసారి కాల్పులు(Gun Firing) కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్ చైతన్యపురిలో నివాసముంటున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి కావడంతో ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలోనే దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ కన్నుమూశాడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Gun Firing: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువకుడి మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES