Wednesday, July 3, 2024
HomeతెలంగాణShort film: చాగలమర్రిలో "వసాద్" షూటింగ్

Short film: చాగలమర్రిలో “వసాద్” షూటింగ్

ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో టీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సామాన్య యువకుడు నాసిర్ పఠాన్. ఈయన వయసు చిన్నదైన పెద్ద పెద్ద ఆలోచనలే ఆయన్ని కొన్ని లఘు చిత్రాలకు రచయితగా మార్చాయి. అదే విధంగా నాసిర్ పఠాన్ ఇప్పటి వరకు 5 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. నాసిర్ పఠాన్ తీస్తున్న సరికొత్త లఘుచిత్రం “వసాద్” అనే టైటిల్ తో ముందుకు వస్తున్నాడు. ఇటీవల రోజుల్లో వసాద్ అనే షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. త్వరలో ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చేయాలని డైరెక్టర్ నాసిర్ పఠాన్ చెప్పారు.

- Advertisement -

ఈ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తున్న నటి నటులు హీరో మాబాషా , విలన్ ఖలందర్ , యాక్టర్లు దోడియం చిన్న వాసు, వల్లంకొండు సాయి, హుసేన్ , అల్లంసా దస్తగిరి, సాగర్ , బాలాజీ, చక్రధర్, అబ్దుల్, శ్రీకాంత్ , షాహిద్, గౌస్ సుభాష్ తదితరులు చాలా అద్భుతంగా నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ని ఎడిటర్ వర్ధన్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. KMD వలి ఆరిఫ్ , లోకేష్ , సైఫ్ అల్తాఫ్ దాదాపు 5 మంది కలసి పని చెయ్యడము విశేషం. ఈ చిత్రీకరణ పూర్తి అయింది త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ ప్రొడక్షన్ కు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన షార్డ్ ఫిల్మ్ టీం సభ్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News