Sunday, November 16, 2025
HomeతెలంగాణSandhya Theater: తొక్కిసలాట ఘటన.. సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు

Sandhya Theater: తొక్కిసలాట ఘటన.. సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో ఆ థియేటర్ యాజమాన్యానికి నగర సీపీ సీవీ ఆనంద్(CV Anand) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘పుష్ప-2’ ప్రీమియర్‌ షో సందర్భంగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన తొక్కిసలాట ఘటనపై లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు. పరైన వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

మరోవైపు ఈ ఘటకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌కు(Allu Arjun) కూడా పోలీసులు షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బన్నీ మధ్యంతర బెయిల్ రద్దుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి తొక్కిసలాట ఘటననను ప్రభుత్వం, పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad