సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో(Ranganayaka Sagar) మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్‌కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో చిన్నకోడూరు మండలంలోని రంగనాయక్ సాగర్ వద్ద ఆగారు. ఈ క్రమంలో సరదాగా ఈతకు దిగారు. ఈత కొడుతుండగా విద్యార్థులు నీట మునిగారు. కుటుంబ సభ్యులు వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. మృతులను మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మిరాజ్ మృతదేహం లభ్యం కాగా అర్బాస్ మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు