నాలుగు జిల్లాలకు తాగు నీరందించే ట్రయల్ రన్ నిర్వహణలో భాగంగా మంగోల్ లో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సీఎం ఓఎస్డీ స్మిత సబర్వాల్, కలెక్టర్ ప్రాశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీరింగ్ అధికారులు.
ఈసందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు తాగునీటి ఎద్దడి నివారణకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 1212 కోట్లతో తాగునీటి వసతి చేపట్టి, 1900 అవాసలకు, 9 నియోజకవర్గాలోని 16 మున్సిపాలిటీ లకు తాగునీరు అందిస్తున్నామన్నారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 50 శాతం ట్రయల్ రన్ చేపట్టినట్టు, ఈ స్కీం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టినట్టు తెలిపారు. ప్రపంచంలోనే మానవులు నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ అని, ఏడు జిల్లాలు, 10 నియోజకవర్గాలోని 1922 గ్రామాలకు నీటి సరఫరా అవుతుందన్నారు. దీంతో హైదరాబాద్ కు మేలు జరగబోతుందని, ఇప్పటి వరకు 300 మిలియన్ లీటర్లు సరఫరా అవుతుండగా, ఇప్పుడు మరో 300 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు అవకాశం ఏర్పడిందని హరీష్ వివరించారు.