కొండపాకలో పశు వైద్యవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్. సిద్దిపేటలో పి.వి. నరసిహావరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి శంకుస్థాపనలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీ లో తిడతారాఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీ లో తిడతారంటూ ఆయన విరుచుకుపడ్డారు. హరీష్ రావు ప్రసంగంలోని హైలైట్స్ ఈ కింది విధంగా ఉన్నాయి..
- Advertisement -
- రైతు ఏడ్చిన రాష్ట్రం ముందుకు పోదంటారు.. మూగజీవాలకు కూడా కెసిఆర్ నాయకత్వంలో విస్తృత సేవలు.
- పశు పాఖాదులకు 1962 కు ఫోన్ చేస్తే అంబులెన్స్ సేవలు.
- 1962 మనం అందుబాటులోకి తెస్తే.. దాన్ని నఖలు కొట్టి దేశమంతా అమలు చేస్తున్నారు.
- మిషన్ భగీరట, రైతుబందు ను కూడా నఖలు కొట్టి దేశమంతా అమలు చేస్తున్నారు.
- కేంద్రం తెలంగాణకు అవార్ఫుల మీద అవార్డులు ఇస్తరు.. గల్లీ లోకి వచ్చి తిడతారు.
- కాంగ్రెస్ వాళ్లు పివికి ఘాట్ కట్టడానికి అనుమతి ఇయ్యలే..ఈ వైద్యశాలకు పివి పేరు పెట్టుకుని వారి గౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్.
- కాళోజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ పేర్లతో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం.
- గత ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదు.
- కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండు ఎండాకాలంలో నూ జలసిరి పెరిగి అలుగు పారుతున్నాయి.
- సిద్దిపేట జిల్లలో 12460 మందికి మత్స్య కారులకు కొత్తగా సభ్యత్వం వస్తున్నది.
- 3.70 లక్షల మందికి రెండో విడత గొర్ల పంపిణీ.
- వెటర్నరీ కాలేజ్ సిద్దిపేటకు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు.
- విద్యను సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు..
★ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్..
- కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమే.
- అద్భుతమైన రిజర్వాయర్లు నిర్మించుకున్నాం.
- గతంలో లక్షా 37 వేళ ఉద్యోగాలు ఇచ్చాము. మళ్ళీ 97 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాము.
- నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన సిదీర్ఘ పోరాటానికి నెటీ పచ్చని తెలంగానే సమాధానం.
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది.. ప్రజలు వాస్తవాలు గుర్తించాలి.
- తెలంగాణలో మనం ఊహించామా.. గోళ్లకుర్మలు, మత్సకారుల అభివృద్ధిని.
- 2014 ముందున్న గోసను నిర్మూలించాం.. అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నాం.
- రాష్ట్రంలో 24 గంటల నిరంతారాయ కరెంట్ ఇస్తున్నాం.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కారెంట్ లేదు.
- ఇన్నేళ్ల గత పాలకులు గోళ్లకుర్మలు, రైతులు, మహిళల పాట్లు తీర్చారా ?
- తెలంగాణ ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదు..
- వారు కళ్ళున్నా చూడలేని కాబోదుల్లా మారారు.
- మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.. మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నాం.
- ఈ నెల చివరిలో రెండో విడత గొర్ల పంపిణీ చేపడతాం అన్నారు.